మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా
మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా మంగళవారం లాభాల్లో ముగిశాయి. కానీ, బెంచ్ మార్క్ సూచీల కంటే వెనుకబడ్డాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.59 శాతం లాభంతో 56,115 వద్ద ముగియగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.43 శాతం లాభంతో 18,503 వద్ద ముగిసింది. రంగాలవారీ సూచీల్లో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 2.84 శాతం లాభపడగా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ ఆటో ఇండెక్స్లు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ మీడియా ఇండెక్స్ లు 0.30 శాతానికి పైగా క్షీణించి స్వల్ప నష్టాలను చవిచూశాయి.