బాంబులేసి, భయపెట్టి
మాచవరం, దాచేపల్లి మండలాల్లో సరస్వతి పవర్ ప్లాంట్ కోసం వైసీపీ నాయకుడు ఆనాడు భూ యజమానులకు తమ బిడ్డల్ని చదివిస్తాం, ఉద్యోగాలిస్తాం అని నమ్మబలికి భూములు రాయించుకున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. వేమవరంలో 710.6 ఎకరాలు, జామయపాలెంలో 273 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 93.79 ఎకరాలు, తంగెడ గ్రామంలో 107.36 ఎకరాలు.. మొత్తం రైతాంగం దగ్గర నుంచి కొన్నది 1384 ఎకరాలు అన్నారు. పట్టా భూములు 1083 ఎకరాలు కాగా…వీటిల్లో సగం పైగా బాంబులేసి, భయపెట్టి లాక్కున్నవే అని ఆరోపించారు.