నందమూరి నటసింహం బాలకృష్ణ(balakrishna)హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్(un stoppble)సీజన్ 4 కొన్ని రోజుల క్రితం ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఆహా వేదికగా ప్రసారమవుతున్న ఈ షో లో మొదటి ఎపిసోడ్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu naidu)రాగా, రెండో ఎపిసోడ్ కి ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ హాజరయ్యాడు. ఇప్పుడు మూడో ఎపిసోడ్ కి సూర్య(suriya)ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఇందుకు సంబంధించిన ప్రోమో రీసెంట్ గా విడుదల అయ్యింది.’సింహం,సమరసింహం కలిసిన వేళ ఉండదా ఎంటర్ టైన్మెంట్ స్కై లెవల్ లోనా’ అనే క్యాప్షన్ తో రిలీజైన ప్రోమోలో బాలకృష్ణ కాళ్ళకి సూర్య నమస్కరించడం, కార్తీ తో సూర్యకి ఎలాంటి అనుబంధం ఉంది. ఫోన్ లో కార్తీ పేరుని  ఏమని సేవ్ చేసుకున్నాడు.ఇద్దరి మధ్య గొడవలు ఏమైనా జరిగాయా,సూర్య లైఫ్ లో జ్యోతిక పాత్ర ఏంటి, సూర్య రియల్ లైఫ్ కి సినీ లైఫ్ కి  సంబంధించి తేడా ఏంటి, సూర్య తన  సీక్రెట్స్ ఎవరితో షేర్ చేసుకుంటాడు, బాలకృష్ణ, సూర్య కి ఐ లవ్ యు ఎందుకు చెప్పాడు, సూర్య చేసే సామాజిక సేవలు.ఇలాంటివన్నీ ఈ షో లో ప్రస్తావనకు రానున్నాయి.

టోటల్ గా ప్రోమో చూస్తుంటే ఈ ఎపిసోడ్ మొత్తం బాలయ్య, సూర్య ఫ్యాన్స్ కి ఒక సరికొత్త అనుభూతుని అందించడం ఖాయమని చెప్పవచ్చు.నవంబర్ 8 న ప్రోగ్రాం టెలికాస్ట్ కానుండగా ఇందులో సూర్య అప్ కమింగ్ మూవీ కంగువా దర్శకుడు శివ(siva)ప్రతినాయకుడుగా చేసిన బాబీడియోల్ కూడా పాల్గొనబోతున్నారు.

   


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here