కుల గణనకు వ్యతిరేకమంటే కులవివక్షకు అనుకూలమే
“కుల వివక్ష అగ్రవర్ణాలలో లేదు. భారత రాజ్యాంగానికి కులవివక్ష వల్ల ముప్పు. కులగణనన ద్వారా వ్యవస్థలను సరిచేయొచ్చు. అన్ని చోట్ల కులవివక్ష ఉంది. రాజకీయ, న్యాయ, కార్పొరేట్ వ్యవస్థల్లో కూడా ఉంది. ఆత్మవిశ్వాసాన్ని కులవివక్ష దెబ్బ తీస్తుంది. కులవివక్ష ఉందని ఒప్పుకోవాలి. కులగణన చేయమన్నందుకూ సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నామని బీజేపీ, మోదీ అంటున్నారు.నిజం చెప్పడం విభజించడమా? కులగణనతో ఎంత మంది దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు ఉన్నారో తేలుతుంది. దాని ద్వారా నిధులను పంచుతాం. కార్పొరేట్ ఇండియాలో ఎంత మంది దళితులు, ఆదివాసీలు, ఓబీసీ లు ఉన్నారు? కులగణనకు వ్యతిరేకంగా ఉన్నారంటే కులవివక్షకు అనుకూలంగా ఉన్నవారే. ప్రధాని ఒక్కసారి కూడా కులవివక్ష గురించి మాట్లాడలేదు. ఎందుకు కులగణనకు మోడీ భయపడుతున్నారు”- రాహుల్ గాంధీ