దీపావళి అమావాస్య ముగిసాక కార్తీక శుద్ధ చతుర్ధినాడు నాగుల చవితి పండుగను నిర్వహించుకుంటారు. దీపావళి తర్వాత వచ్చే ముఖ్యమైన పండగల్లో ఇది ఒకటి. పవిత్ర మాసమైన కార్తీక మాసంలో ఈ నాగుల చవితి పండుగ వచ్చింది. సుబ్రమణ్య స్వామిని ఆరాధించే భక్తులు నాగులు చవితిని వైభవంగా నిర్వహించుకుంటారు. నాగుల నుంచి రక్షణ కల్పించమని ఆ సుబ్రమణ్యేశ్వర స్వామిని కోరతారు. నాగులకు పురాణాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే నాగుల చవితి రోజు పొట్ట దగ్గర పూజ చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. నాగేంద్రుడికి కచ్చితంగా నాగుల చవితి రోజు చలిమిడి, నువ్వులతో చేసే చిమ్మిలి ప్రసాదాలుగా పెడతారు. వీటి రెసిపీలను ఇక్కడ ఇచ్చాము. చాలా సులువుగా వీటిని చేసేయండి.