పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)రీసెంట్ గా  ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో మాట్లాడుతు  రాష్ట్రంలో ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల విషయంలో పోలీసులు సరైన యాక్షన్ తీసుకోవడంలేదని, సోషల్ మీడియాలో కూడా ముఖ్యమంత్రి గారి మీద, తన మీద పరుష పదజాలంతో, అత్యంత జుగుప్సాకరమైన రీతిలో పోస్ట్ లు చేస్తున్నా కూడా ఆ క్రిమినల్స్ ని కనిపెట్టలేకపోతున్నారు. ఇలా అయితే చంద్రబాబు గారిని అడిగి హోమ్ మినిస్టర్ శాఖ ని తీసుకుంటానని తన ఆవేదనని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అమరావతి(amaravathi)జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుడు బాలకోటయ్య(balakotaih)మాట్లాడుతు పవన్ కళ్యాణ్ ఇటాలియా చిత్రకారుడు గీసిన మోనాలిసా బొమ్మ. కడుపులో ఏది ఉంచుకోకుండా బయటపెట్టేస్తాడు.గదిలో మాట్లాడుకోవాల్సిన  మాటలని బయట, బయట మాట్లాడుకోవాల్సిన మాటలని గదిలో చెప్తాడు.అంటే తన మనసులో ఏమనిపించిందో అది అనేస్తాడు.ఆయన మాట్లాడింది మాత్రం అబద్దం అయితే కాదు.కాలకేయుల పరిపాలన నుంచి బయటపడ్డాక, అలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యం. ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ లాగే జరగాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కోరుకుంటే చంద్రబాబు నాయుడు(chandrababu naidu)గారు హోమ్ మినిస్టర్ ఇవ్వడానికి కూడా సిద్దమవుతారని చెప్పుకొచ్చాడు.

 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here