తెలుగు వాళ్ళు మూడువందల ఏళ్ళ క్రితం అంతఃపురంలో ఉండే చెలికత్తెలుగా తమిళనాడుకి వచ్చి, ఆ తర్వాత  తమిళులుగా చలామణి అయ్యారని ప్రముఖ సినీ నటి కస్తూరి(kasthuri)ఇటీవల కొన్ని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.దీంతో తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్లే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఆమె మీద మండిపడుతున్నారు.

 ఈ విషయంపై కస్తూరి పై చర్యలు తీసుకోవాలంటూ  తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉన్న తెలుగు సంఘాలు ఆమెపై  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.దీంతో  కస్తూరిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. కస్తూరి తన వ్యాఖ్యల తర్వాత మాట్లాడుతూ తెలుగు వాళ్ళ గురించి నేను తప్పుగా మాట్లాడలేదని,తెలుగు వాళ్లంటే నాకెంతో అభిమానమని, వాళ్ల వాళ్లే నేను ఈ రోజు ఒక స్థాయిలో ఉన్నాను, నేను పెళ్లి చేసుకుంది కూడా ఆంధ్ర అబ్బాయినే. అధికార డిఎంకె(dmk)పార్టీ కావాలనే తన మాటలని వక్రీకరించిందని  చెప్పుకొచ్చింది.

 


 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here