శాకాహారి దేశీ నెయ్యి తయారుచేసే విధానం చాలా సులభం. దీని కోసం, మొదట మూడు నూనెలు.. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, సన్ ఫ్లవర్ నూనె ఒక గిన్నెలో వేసి కలపాలి. స్టవ్ మీద కళాయి పెట్టి ఆ మూడు నూనెలను వేసి చిన్న మంట మీద వేడి చేయాలి. ఇప్పుడు జామ ఆకులు లేదా కరివేపాకులను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. అందులో నీరు కలపకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఈ పేస్టును కూడా నూనెల్లో వేసి వేడి చేయాలి. అలాగే పసుపును కూడా వేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని అరగంట పాటూ వేడి చేశాక స్టవ్ ఆఫ్ చేయండి. కొద్దిగా చల్లారిన తర్వాత బాగా వడకట్టి ఒక సీసాలో వేయాలి. అంతే నెయ్యి తయారైనట్టే. దీన్ని ఫ్రిజ్ లో పెడితే గట్టిగా మారుతుంది. ఇది అచ్చం ఆవు నెయ్యి లాగానే ఉంటుంది. కేవలం చూడటానికే కాదు, దాని రుచి కూడా దేశీ నెయ్యి మాదిరిగానే ఉంటుంది. మరెందుకు ఆలస్యం ఈ సులువైన రెసిపీతో వీగన్ నెయ్యిని తయారు చేసేయండి. సాధారణ నెయ్యితో పోలిస్తే ఇది చాలా తక్కువ ఖర్చుతో సిద్ధమైపోతుంది.