43 నుంచి 23కి
నాబార్డ్ తో సంప్రదించి గ్రామీణ బ్యాంకుల విలీనంపై బ్లూప్రింట్ తయారు చేయనుంది కేంద్రం. నవంబర్ 20లోగా గ్రామీణ బ్యాంకుల స్పాన్సర్ బ్యాంకుల నుంచి అభిప్రాయాలను కేంద్రం తెలుసుకోంది. మూడు దశల బ్యాంకుల విలీనంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సంఖ్య 196 నుంచి 43కి తగ్గింది. ఇప్పుడు వీటి సంఖ్య 28కి చేరనుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో సుమారు 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు విలీనం కానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాలుగు బ్యాంకులు ఉండగా, ఉత్తర్ ప్రదేశ్ లో 3, పశ్చిమ బెంగాల్ 3, బిహార్ , గుజరాత్, జమ్మూ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటకలలో రెండేసి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి.