యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)దేవర(devara)తో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద సృష్టించిన కలెక్షన్ల సునామి గురించి  అందరకి తెలిసిందే.ఐదు వందల కోట్ల కల్లెక్షన్స్ ని రాబట్టి తన కట్ అవుట్ కి ఉన్న స్టామినా ఏంటో మరోసారి నిరూపించాడు.మరి కొన్ని రోజుల్లోనే యాభై రోజులు కూడా పూర్తి చేసుకుబోతున్న దేవర ఎన్టీఆర్ అభిమానుల్లో అయితే సరికొత్త ఉత్సాహాన్ని కూడా నింపింది.

ఎన్టీఆర్ ఈ రోజు ఉదయమే హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లోప్రత్యక్ష మయ్యాడు. చేతికి ఒక బ్యాగ్  తగిలించుకొని, చాలా సింపుల్ గా ఉన్న ఎన్టీఆర్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

బాలీవుడ్ లో తెరకెక్కుతున్న వార్ 2 మూవీ షూటింగ్ కోసం ముంబై వెళ్తున్నట్టుగా తెలుస్తుంది.కొన్ని రోజుల నుంచి ఎన్టీఆర్ వార్ 2 లో పాల్గొంటూ వస్తున్నాడు. ఇప్పుడు మరోసారి ఒక భారీ షెడ్యూల్ లో పాల్గొనబోతునట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.హృతిక్ రోషన్(hrithik roshan)తో  కలిసి ఎన్టీఆర్ చేస్తున్న ఈ మూవీపై ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. షారుక్(shah rukh khan)కూడా వార్ 2(war 2)లో  ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడని, ఈ మేరకు షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడని కొన్ని రోజుల క్రితం షారుక్ సన్నిహిత వర్గాలు తెలియచేశాయి. 

దీంతో ఇపుడు ఎన్టీఆర్ కూడా షూట్ లో పాల్గొనబోవడంతో ఆ ఇద్దరి మధ్య ఏమైనా సీన్స్ తెరకెక్కించబోతున్నారనే ప్రచారం కూడా  సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. చిత్ర బృందం అయితే షారుక్ తమ సినిమాలో ఉన్నాడనే విషయాన్నీ అయితే అధికారకంగా వెల్లడి చెయ్యలేదు.ఇక ఎన్టీఆర్ మునపటి లాగా కాకుండా తన సినిమాల  విషయంలో వేగాన్ని పెంచాడు. దేవర 2 తో పాటు ప్రశాంత్ నీల్(prashanth neel)సినిమాని కూడా ఏక కాలంలో పూర్తి చెయ్యాలని అనుకుంటున్నాడు. 

 

  


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here