శివకార్తికేయన్(sivakarthikeyan)సాయిపల్లవి(sai pallavi)జంటగా దివాలి కానుకగా ఈ నెల 31 న  తెలుగుప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ అమరన్(amaran) తమిళనాడుకి చెందిన దివగంత మేజర్ ముకుంద్ వరద రాజన్(mukund varada rajan)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని ప్రముఖ హీరో నితిన్(nithiin)తెలుగునాట తన శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై విడుదల చెయ్యటం జరిగింది.

ఇక అమరన్ విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న సందర్భంగా చిత్ర యూనిట్  రీసెంట్ గా హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ని నిర్వహించడం జరిగింది.అందులో నితిన్ మాట్లాడుతూ నాకు శివ కార్తికేయన్ కి మధ్య ఎప్పటినుంచో పరిచయం ఉంది.అజిత్, దేవయాని హీరో హీరోయిన్లుగా వచ్చిన ప్రేమలేఖ సినిమాలో ఆ ఇద్దరు పక్క పక్కనే ఉండి కూడా ఒకరి కోసం ఒకరు వెతుక్కుంటూ  ఉంటారు.అలాగే శివ కార్తికేయన్ కి నాకు ఎప్పటినుంచో పరిచయం ఉన్నా కూడా ఇంతవరకు పర్సనల్ గా కలవలేకపోయాం. ఫోన్ మాట్లాడుకోవడం,మెస్సేజ్ లు చేసుకోవడం లాంటివే మా ఇద్దరి మధ్యన జరుగుతుండేవి.

తను హైదరాబాద్ వచ్చినప్పుడు నేను వేరే చోట ఉండటం, నేను అక్కడికి వెళ్ళినప్పుడు తను వేరే చోట ఉండటం లాంటివి జరిగాయని చెప్పుకొచ్చాడు.ఈ కార్యక్రమంలో సాయి పల్లవి, నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, దర్శకుడు రాజ్ కుమార్ పెరియ స్వామి(raj kumar periyaswamy)తో పాటు శివ కార్తికేయన్ అభిమానులు పాల్గొన్నారు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here