రౌడీ షీటర్‌కు మర్యాదలు చేసిన ఏడుగురు ఏపీ పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మంగళగిరి కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలించే సమయంలో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ ను ఏలూరులోని ఓ రెస్టారెంట్ కు పోలీసులు తీసుకెళ్లారు. అతనితో సరదాగ మాట్లాడుతూ చికెన్ బిర్యాని తినిపించారు పోలీసులు. రెస్టారెంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో పోలీసుల వ్యవహారం అంత నమోదైంది. ఆ వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలోనే ఏడుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here