నిందితులపై స్థానికుల దాడి

ఆ బాలికను కిడ్నాప్ చేసి లైంగికవేధింపులకు పాల్పడిన జంటపై స్థానికులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం పోలీసులు వారిని చెదరగొట్టి, ఆ జంటను పోలీసు స్టేషన్ కు తరలించారు. వారిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 137(2) (కిడ్నాప్) కింద, పోక్సో (pocso act) చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులైన జంటకు ఆ బాలిక కుటుంబం ఒకరికొకరు తెలుసునని చెప్పారు. ఇది సున్నితమైన అంశమని పేర్కొంటూ మరిన్ని వివరాలు వెల్లడించడానికి ఉన్నతాధికారులు నిరాకరించారు. కాగా, రెస్క్యూ అనంతరం మైనర్ బాలికను కౌన్సిలింగ్ కు పంపించారు. ఆమెకు వైద్య పరీక్షలు, ఇతర పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here