ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్బంగా కేఏ పాల్ స్వయంగా తన పిటిషన్ పై వాదనలు వినిపించారు. 746 మంది కాథలిక్స్ కోసం వాటికన్ సిటీ ఏర్పాటు చేసినప్పుడు, 30 లక్షల మంది భక్తులు ఉన్న తిరుపతి సిటీని ఎందుకు కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయలేమన్నారు. ఇది ప్రాథమిక, మానవ హక్కుల ఉల్లంఘన అన్నారు. ఇందుకు సంబంధించి రాజ్యాంగంలోని 14, 21, 25, 26 ఆర్టికల్స్ ను ఎత్తిచూపారు.