ఏపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రకటించింది. 184 మందిని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు విద్యాశాఖ ఎంపిక చేసింది. ఈ నెల 11న జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో జరిగే కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖలో 77 మంది, ఇంటర్మీడియట్ విద్యాశాఖలో 26 మంది, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్లు 16, డిగ్రీ లెక్చరర్లు 19, ఇంజినీరింగ్, ఫార్మసీ లెక్చరర్లు 4గురు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు 32 మందిని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వరించాయి. అవార్డులకు ఎంపికైన వారి జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది.
Home Andhra Pradesh 184 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు, విద్యాశాఖ ప్రకటన-లిస్ట్ ఇదే-ap govt announces best teacher...