ఏపీలోని కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల రెండో జాబితాను విడుదల చేసింది. దాదాపు 50కి పైగా కార్పొరేషన్లకు ఛైర్మన్లు ఖరారయ్యారు. ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా మహమ్మద్ షరీఫ్ తో పాటు చాగంటి కోటేశ్వరరావుకు అవకాశం దక్కింది. వీరికి కేబినెట్ ర్యాంక్ ఉండనుంది.