నిరసన తెలిపితే కొడతారా?-కౌశిక్ రెడ్డి
దళిత బంధు రెండో విడత లబ్దిదారులకు వెంటనే నిధులు విడుదల చేయాలని ఆందోళన చేస్తే పోలీసులు అడ్డుకుని ఇష్టం వచ్చిన్నట్లు కొట్టారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. దళితులు మహిళలు అని చూడకుండా ఈడ్చుకెళ్లి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఏం తప్పు చేశామని కొట్టారని పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల సమస్యలపై, ప్రజా సమస్యల మీద, న్యాయమైన డిమాండ్ పరిష్కారం కోసం ఆందోళన చేస్తే కొడతారా? అని మండిపడ్డారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా చివరకు తన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ, దళితులకు ఇవ్వాల్సిన రెండో విడత దళిత బంధు నిధులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.