మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప-2’లో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు ఇటీవల న్యూస్ వినిపించాయి. సాంగ్ షూట్ కి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో ‘పుష్ప-2’ సాంగ్ లో శ్రీలీల సందడి చేయనున్న విషయాన్ని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. (Pushpa 2 The Rule)
‘పుష్ప-1’ లో అల్లు అర్జున్-సమంతలపై చిత్రీకరించిన “ఊ అంటావా మామా ఊఊ అంటావా” సాంగ్ జాతీయ స్థాయిలో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. అందుకే ‘పుష్ప-2’ స్పెషల్ సాంగ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సాంగ్ చిందేయనున్న హీరోయిన్ అంటూ గతంలో రకరకాల పేర్లు వినిపించాయి. చివరికి ఈ అవకాశం వరించింది. శ్రీలీలపై ఓ స్పెషల్ మాసివ్ కిస్సిక్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. అల్లు అర్జున్, శ్రీలీల ఎంత మంచి డ్యాన్సర్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ఈ ఇద్దరు కలిసి చిందేస్తే సాంగ్ ఓ రేంజ్ హిట్ అవుతుంది అనడంలో డౌట్ లేదు.
‘పుష్ప-2’ చిత్రానికి సుకుమార్ దర్శకుడు.సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న ఈ సినిమా థియేటర్లలో అడుగుపెట్టనుంది.
త్వరలోనే ఈ చిత్రం ప్రమోషన్స్‌ను పాట్నా, కలకత్తా, చెన్నయ్, కొచ్చి, బెంగళూరు, ముంబయ్ మరియు హైదరాబాద్‌లో మాసివ్‌గా నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం ఒకవైపు చివరి దశలో వున్న చిత్రీకరణతో పాటు, మరో వైపు నిర్మాణానంతర పనులను ఈ చిత్రం జరుపుకుంటోంది.