శుక్ర సంచారం: జ్యోతిష్య శాస్త్రంలో శుక్రునికి ప్రత్యేక స్థానం ఉంది. శుక్రుడు శారీరక ఆనందం, వైవాహిక ఆనందం, కీర్తి, కళ, ప్రతిభ, అందం, శృంగారం, కామం, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి అంశాలకు కారకుడని విశ్వసిస్తారు. ఇవే కాకుండా శుక్రుడు కొన్ని రాశులపై ప్రత్యేక సంబంధం కలిగి ఉన్నాడు. వృషభం, తులారాశికి శుక్రుడు అధిపతి కాగా, మీన రాశి వారికి ఉన్నత రాశి. అలాగే కన్యా రాశి వారికి అల్ప రాశి. ఈ క్రమంలో డిసెంబర్ 2న శుక్రుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తే కొన్ని రాశుల వారికి శుభాలు, మరికొన్ని రాశుల వారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే వారు జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఎవరికి కలిసి వస్తుందో, ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం…