రానున్న ఐదేళ్లలో దేశంలోని టాప్ 500 కంపెనీల్లో కోటి మందికి ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 1.25 లక్షల ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించాలని కేంద్రం భావిస్తోంది. ఈ లక్ష్యంతో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024’ దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. పీఎం ఇంటర్న్ షిప్-2024 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటితో(నవంబర్ 10) ముగియనుంది. అర్హత గల అభ్యర్థులు https://pminternship.mca.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.5 వేలు స్టైఫండ్ ఇస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here