నిరూపించుకునేవరకు
దుగ్గిరాల ఇంటి వారసుడివి అని, ఆటో నడుపుకోవాల్సిన గతి పట్టలేదని, ఇదంతా జరిగింది అప్పును పెళ్లి చేసుకోవడం వల్లే అని ధాన్యలక్ష్మీ నానా మాటలు అంటుంది. కనకం కుటుంబాన్ని కూడా నిందిస్తుంది ధాన్యలక్ష్మీ. తల్లి ఎంత చెప్పిన తాను ఇంటికి రానని, ఆటో నడుపుకోవడం తప్పు కాదని, తన కాళ్ల మీద నిలబడేవరకు, తానేంటో నిరూపించుకునేవరకు రానని కల్యాణ్ బదులిస్తాడు.