యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ ‘క’ దీపావళికి విడుదలై మంచి విజయం సాధించింది. తాజాగా ‘క’ సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి, మూవీ టీమ్ కు అభినందనలు తెలిపారు. ఏకంగా మెగాస్టార్ అభినందించడంతో చిత్ర బృందం సంతోషంలో మునిగి తేలుతోంది.

‘క’ సినిమాను దర్శకద్వయం సుజీత్, సందీప్ రూపొందించారు. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన క మూవీ.. ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ తో దిగ్విజయంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది.

అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్ లే, బలగం జయరాం తదితరులు ఈ చిత్రంలో నటించారు. సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి డీఓపీలుగా విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం, ఎడిటర్ గా శ్రీ వరప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ గా సుధీర్ మాచర్ల వర్క్ చేశారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here