పవిత్ర తులసి, శాలిగ్రామ భగవంతుడి వివాహ కార్యక్రమం కోసం వీటిని సిద్ధం చేయాలి. పూజించేందుకు తులసి మొక్క, శాలిగ్రామ రాయి, విష్ణుమూర్తి విగ్రహం లేదా ఫొటో, పూజా చౌకీ, ఎరుపు రంగు వస్త్రం, కలశం, అరటి ఆకు, పసుపు ముద్ద, గంధం, రోలి, నువ్వులు, మౌళి, ధూపం, దీపం వంటివి సమకూర్చుకోవాలి. ఆ తర్వాత తులసిమాతను అందంగా అలంకరించేందుకు కావాల్సినవి (బొట్టు, ఎరుపు చునారి, కుంకుమ, గోరింటాకు, కుంకుమ, చీర మొదలైనవి అవసరం). వీటితో పాటే చెరుకు, దానిమ్మ, అరటి, సింఘాడ, ముల్లంగి, ఉసిరి, మామిడి ఆకు, కొబ్బరి, అష్టదళ తామర, చిలగడదుంప, గంగాజలం, సీతాఫలం, జామ, కర్పూరం, పండ్లు, పూలు, బటాషా, స్వీట్లు మొదలైనవి అవసరం. ఇంటిని శుభ్రం చేసుకుని తులసి చెట్టును రంగులరంగుల పువ్వులు, ముగ్గులతో అలంకరించాలి.