గుంటూరులో డీఎస్సీ కోచింగ్ సెంటర్లను తాను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్కో కోచింగ్ సెంటర్‌లో 200 మంది అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వనున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,200 మందికి కోచింగ్ ఇవ్వనున్నామన్నారు. బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం చొప్పున సీట్లు కేటాయించామన్నారు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 520 సీట్లు అదనంగా కేటాయించామన్నారు. రెండు నెలల పాటు ఇవ్వనున్న ఉచిత డీఎస్సీ కోచింగ్ సమయంలో.. నెలకు రూ.1,500 చొప్పున స్టైఫండ్ అందజేయనున్నట్లు తెలిపారు. మెటీరియల్ కోసం అదనంగా మరో రూ.1,000 ఇవ్వనున్నామన్నారు.
Home Andhra Pradesh డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. నోటిఫికేషన్‌కు మరో రెండు నెలలు పట్టొచ్చు!-chances of dsc notification being...