కాఫీ, టీలు మితంగా..
30 ఏళ్ల వయసు దాటిన మహిళలు.. కఫీన్ ఉండే కాఫీలు, టీలు ఎక్కువగా సేవించకూడదు. కఫీన్ ఎక్కువైతే హర్మోన్ల అసమతుల్యత ఎదురవొచ్చు. వీటి వల్ల ఆందోళన, హైపర్టెన్షన్, ఏకాగ్రతలోపం, డిప్రెషన్ లాంటి సమస్యలు తలెత్తే రిస్క్ పెరుగుతుంది. కఫీన్ ఎక్కువగా తీసుకుంటే చర్మంపై వృద్ధాప్య ఛాయలు ఎక్కువవుతాయి. ముడతలు, చారలు తక్కువ వయసులోనే రావొచ్చు.