AP Rains Update: నైరుతి బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వెంబడి కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో బుధ, గురు వారాల్లో కోస్తాంధ్ర,రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.