“గతంలో అమ్మమ్మ నానమ్మలు వంట చేసేంత వరకు రెండు మూడు గంటలు వెయిట్ చేసేవాళ్లం. లేదా మంచి హోటల్‌కు వెళ్లేవాళ్లం. ఇప్పుడు స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే రెండు నిమిషాల్లో వస్తోంది. మనం అమ్మ, అమ్మమ్మ, నానమ్మలపై ఆధారపడడం లేదు.. స్విగ్గీపై ఆధారపడుతున్నాం. ఇప్పడు స్విగ్గీ రాజకీయాలు ఎక్కువయ్యాయి. సరళీకరణ తర్వాత సిద్ధాంతపరమైన రాజకీయాలు, ఆలోచనలు, అనుసంధానత తగ్గిపోయింది. మాకు ఎంత త్వరగా ఉద్యోగం వస్తుంది. ఎంత త్వరగా సంపాదిస్తాం అని ఆలోచిస్తున్నారు. మేం విద్యార్థులుగా ఉన్నప్పుడు మేమే వాల్ రైటింగ్ చేసేవాళ్లం. జెండాలు కట్టేవాళ్లం. ర్యాలీలు చేసేవాళ్లం. మా జేబులోని డబ్బులు ఖర్చుపెట్టుకొని పని చేసేవాళ్లం. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది” – సీఎం రేవంత్ రెడ్డి