‘అప్పులు, రైతుల సమస్యలు, ఆసుపత్రులు, తాగు నీరు, సాగు నీరు, కరెంట్, విద్య, వైద్యం.. ఇలా అన్ని అంశాల్లో చర్చ చేసేందుకు నేను సిద్ధం. 36 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు. కొవిడ్ ఉన్న సమయంలోనూ కేసీఆర్ రైతు బంధు ఇచ్చారు. పోలీసులే తమ పోలీసులను కొట్టేలా చేశావు. నేతన్నలను ఆత్మహత్యల పాలు చేస్తున్నావు. అశోక్ నగర్ లో నిరుద్యోగ యువతను వీపులు పగిలేలా కొట్టినవు. దళిత బంధు కోల్పోయారు. గొర్రెలు కోల్పోయారు. చేప పిల్లలు కోల్పోయారు’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.