కెరీర్‌లో ఫస్ట్ సెంచరీ
డెత్ ఓవర్లలో రమణదీప్ సింగ్ (15: 6 బంతుల్లో 1×4, 1×6) నుంచి లభించిన సపోర్ట్‌తో టీ20 కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేసిన తిలక్ వర్మ.. భారత్ జట్టు స్కోరు బోర్డుని కూడా 200 దాటించేశాడు. వాస్తవానికి 22 ఏళ్ల తిలక్ వర్మ భారత టీ20 జట్టులోకి వచ్చి ఏడాదే అవుతోంది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 19 టీ20లు ఆడిన తిలక్ వర్మ.. 148.06 స్ట్రైక్ రేట్‌తో 496 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి.