ప్రతి వ్యక్తికీ శారీరక, మానసిక, సామాజిక, పర్యావరణ శ్రేయస్సు లభించే విధంగా సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సాధన లక్ష్యంగా ప్రభుత్వ ప్రతినిధులు, ఆరోగ్య నిపుణులు, పౌర సమాజ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండటం, జవాబుదారీతనం ఉండే వ్యవస్థ రూపకల్పన తదితర ముఖ్యమైన అంశాలను పరిష్కరిస్తూ.. ప్రజారోగ్యం, సామాజిక న్యాయం, పర్యావరణ సుస్థిరతకు ప్రాధాన్యత ఇచ్చేలా సమగ్ర ఆరోగ్య హక్కు చట్టం చేయాలని ఈ వర్క్‌షాప్ చివరి రోజైన బుధవారం ఒక డిక్లరేషన్‌ను ఆమోదించింది.