ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీవో జీఎంపీ
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ షేర్లు నవంబర్ 13, మంగళవారం గ్రే మార్కెట్లో రూ. 5 ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. ఈ ఐపీఓ మార్కెట్లోకి రావడానికి మరో వారం సమయం ఉన్నందున ఈ జీఎంపీ (GMP) మరింత పెరిగే అవకాశం ఉందని వివరించారు. కాగా, రూ.10,000 కోట్ల విలువైన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓలో కొత్తగా జారీ చేసిన ఈక్విటీ షేర్లు మాత్రమే ఉంటాయి. ఈ కొత్త ఇష్యూ ద్వారా వచ్చే మొత్తం రూ.7,500 కోట్లను ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (NREL)లో పెట్టుబడులు, ఎన్ఆర్ఈఎల్ కు సంబంధించిన కొన్ని ప్రస్తుత రుణాలను తిరిగి చెల్లించడం, అలాగే సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వెచ్చించనున్నారు. ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్, నువామా వెల్త్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఈ ఆఫర్ కు రిజిస్ట్రార్ గా వ్యవహరిస్తున్నాయి.