కొన్ని రోజుల క్రితం ప్రముఖ అగ్ర హీరో నాగార్జున(nagarjuna)పై అయన కుటుంబ సభ్యుల పై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(konda surekha)కొన్ని అసత్య ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం పై నాగార్జున నాంపల్లి  కోర్టులో పరువు నష్ట దావా కేసు వేసిన విషయం కూడా తెలిసిందే.

ఈ నేపథ్యంలో కొండా సురేఖ కోర్టుకి హాజరై వివరణ ఇవ్వాలని నాంపల్లి కోర్టు నోటిసులని జారీ చేసింది.దీంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది.నాగార్జున తో పాటే  తెలంగాణ మాజీ మంత్రి కేటిఆర్ కూడా కేసు ఫెయిల్ చేసిన విషయం తెలిసిందే.సురేఖ ఈ కేసుపై కౌంటర్ ఫైల్ ని దాఖలు చేసిందనే వార్తలు వస్తున్నాయి.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here