ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. వీటిని తినమని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తూనే ఉంటారు. అయితే ఆకుకూరలు ఒక్కసారిగా అధికంగా తెచ్చుకుంటే వాటిని నిల్వ చేయడం కష్టంగా మారిపోతుంది. తెచ్చిన ఒకట్రెండు రోజుల్లోనే వాటిని వండేయాలి. లేకుంటే అవి ఫ్రిజ్ లో పెట్టిన కూడా త్వరగా పాడైపోతాయి. పాలకూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, బచ్చలికూర వంటివన్నీ తాజాగా మార్కెట్లో లభిస్తాయి.