3. జేవీ ఛానల్ వివరాలు
ఈ డీల్ విజయవంతంగా పూర్తయితే భారతీయ మీడియా, ఎంటర్టైన్మెంట్ , స్పోర్ట్స్ సెక్టార్ లో అతిపెద్ద సంస్థగా ఇది అవతరించనుంది. పలు భాషల్లో 100కు పైగా ఛానళ్లు, రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ లు, దేశవ్యాప్తంగా 750 మిలియన్ల వ్యూయర్ బేస్ దీనికి ఉంటుంది. వినోదం (ఉదా. కలర్స్, స్టార్ ప్లస్, స్టార్ గోల్డ్), క్రీడలు (ఉదా. స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18), జియో సినిమా, హాట్ స్టార్ వంటి ఓటీటీ (ott)లు ఇందులో భాగమవుతాయి. విలీన సంస్థకు భారతదేశంలో డిస్నీ సినిమాలను పంపిణీ చేయడానికి ప్రత్యేక హక్కులు కూడా అందుతాయి. 30,000 కంటే ఎక్కువ డిస్నీ కంటెంట్ ఆస్తులకు లైసెన్స్ లభిస్తుంది. ఇది భారతీయ వినియోగదారులకు పూర్తి వినోద ఎంపికలను అందిస్తుంది.