వింధ్య టెలిలింక్స్ లిమిటెడ్
ఎంపీ బిర్లా గ్రూప్ లో భాగమైన ఈ సంస్థ పలు టెలికాం ప్రాజెక్టుల్లో నిమగ్నమైంది. ఇది ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, ఇంట్రాసిటీ హెచ్డిడి-బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్, టెలికాం కంపెనీల టవర్ల ఏర్పాటుకు మొత్తం మౌలిక సదుపాయాలు, ఇహెచ్వి క్యాబ్లింగ్, ట్రాన్స్మిషన్ లైన్లు తదితర సేవలు అందిస్తుంది. టెలికాం కంపెనీలు, విద్యుత్ సంస్థలు, ఎల్ఈడీ లైటింగ్, గ్యాస్ పైప్ లైన్ల లో నిమగ్నమైన వ్యాపారాలు ఈ సంస్థకు ప్రధాన కస్టమర్లు. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఇండియన్ రైల్వేస్, ఇండియన్ ఆర్మీ, ఎన్టీపీసీ, సెయిల్, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ దీని క్లయింట్లలో కొన్ని. వాటర్ శానిటేషన్ ప్రాజెక్టుల ఈపీసీలోకి కూడా ఈ సంస్థ ప్రవేశించింది. వింధ్య టెలిలింక్స్ ప్రస్తుత బుక్ వ్యాల్యూ రూ.3,490గా ఉంది. దీని షేరు ధర ప్రస్తుతం రూ .1,930 గా ఉంది. రాబడుల విషయానికి వస్తే, స్టాక్ 10 రెట్ల పిఇ మల్టిపుల్ వద్ద ట్రేడ్ అవుతుంది, సగటు పిఇ 6 రెట్లు. కొన్నేళ్లుగా కంపెనీ ఆదాయం ఏటేటా పెరుగుతున్నప్పటికీ లాభదాయకతను మెరుగుపర్చుకోవడం సవాలుగా మారింది. కంపెనీకి రూ.3,800 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఈ స్టాక్ గరిష్ట స్థాయి నుండి దాదాపు 50% పడిపోయింది.