వైసీపీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీతో టచ్ లోకి వెళ్లారని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజును వైసీపీ బహిష్కరించింది. అనంతరం శాసనమండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేసింది. మండలి ఛైర్మన్…ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు వేశారు. దీంతో విజయగనరం జిల్లా ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. జూన్‌ 3 నుంచి ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసింది. ఛైర్మన్ నిర్ణయాన్ని సవాల్ చేసిన రఘురాజు…హైకోర్టులో ఊరట లభించటంతో ఈసీ కూడా తాజాగా నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్ రద్దు కావటంతో రఘురాజే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here