జీవితంలో మనల్ని ఇబ్బంది పెడుతున్న ప్రతికూల శక్తులు ఎన్నో ఉంటాయి. అవేంటని మనం గుర్తించలేనప్పటికీ వీటి ప్రభావం ఇంట్లో ఆర్థిక శ్రేయస్సు, ఆరోగ్యంపై కచ్చితంగా కనిపిస్తుంది. సనాతన ధర్మం చెబుతున్న విషయం ఏంటంటే.. మన చుట్టూ ఉంటే ఎన్నో రకాల ప్రతికూల శక్తులను వదిలించుకోవడానికి వాస్తు శాస్త్రం మనకు చాలా బాగా సహాయపడుతుంది. వాస్తు అంటే కేవలం ఇంటిని నిర్మించేందుకు, శుభకార్యాలను ప్రారంభించేందుకు మాత్రమే ముఖ్యమని చాలా మంది భావిస్తారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కొన్ని వాస్తు సూచనల కారణంగా మనం జీవితం సంతోషం, శ్రేయస్సు, ఆరోగ్యంతో నిండిపోతుంది. అలాగే కొన్ని వాస్తు పొరపాట్ల వల్ల అనునిత్యం చికాకులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. వాస్తు ప్రకారం, నిద్రపోయేటప్పుడు కొన్ని వస్తువులను తల కింద లేదా దిండుకు దగ్గరగా ఉంచడం అస్సలు మంచిది కాదు.