ఇంటర్వ్యూ రౌండ్
రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ రౌండ్ కు హాజరుకావాలి. ఇంటర్వ్యూ తేదీని అభ్యర్థులకు తగిన సమయంలో తెలియజేస్తారు. ఇంటర్వ్యూ తేదీ, సమయం మరియు స్థలాన్ని సూచించే ఇంటర్వ్యూ కాల్ లెటర్లు షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు (సరైన సమయంలో) noreply.samadhan@rbi.org.in నుండి వారి రిజిస్టర్డ్ ఇమెయిల్ చిరునామాలకు పంపిస్తారు. దీని కోసం అభ్యర్థులు స్పామ్, జంక్ బాక్స్ సహా మెయిల్ బాక్స్ చెక్ చేసుకోవాలని కోరారు. ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 25న ప్రారంభమై ఆగస్టు 16, 2024న ముగిసింది. ఈ రిక్రూట్మెంట్ (recruitment) డ్రైవ్ లో 94 పోస్టులను భర్తీ చేయనున్నారు, వీటిలో 66 గ్రేడ్ ‘బి’ (డిఆర్)-జనరల్లో ఆఫీసర్లుగా, 21 గ్రేడ్ ‘బి’ (డిఆర్)-డిఇపిఆర్ లో ఆఫీసర్లుగా, 7 గ్రేడ్ ‘బి’ (డిఆర్)-డిఎస్ఐఎంలో ఆఫీసర్లుగా భర్తీ చేస్తారు.