‘చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ముందు నిలిచింది. పంజాబ్ , హర్యానా రాష్ట్రాల కంటే తెలంగాణలో ఎక్కువ ధాన్యం ఉత్పత్తి అయ్యింది. 40 లక్షల ఎకరాల్లో సన్నం ధాన్యం సాగు అయ్యింది. జనవరి నుంచి సన్న బియ్యం ఇవ్వాలనీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. 17 శాతం తేమ కంటే ఎక్కువ ఉన్నా.. రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నాం’ అని తుమ్మల నాగేశ్వర రావు వివరించారు.