ఇతర స్పెసిఫికేషన్లు..
చైనాలో ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్.. 16 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ స్టోరేజ్‌తో వచ్చాయి. ఎక్స్200 ప్రోలో 1.5కే రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.78 ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్, ఎక్స్200లో 6.67 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉన్నాయి. ఎక్స్200 5,800 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి మద్దతు ఇస్తుంది. ఎక్స్ 200 ప్రో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.