బాడీ లాంగ్వేజ్ ఇలా
కమ్యూనికేషన్ లో బాడీ లాంగ్వేజ్, ముఖ కవళికలు చాలా ముఖ్యం. అవి ఎంత పద్ధతిగా ఉంటే ఎదుటివారు కూడా మీరు ఇచ్చే వివరణను అంతే పద్ధతిగా స్వీకరిస్తారు. లేకుంటే అది సమస్యగా మారిపోయే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడూ మీ స్థానంలోనే ఉండే కాదు… ఎదుటివారి స్థానంలో ఉండి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఇది వారి బాధను, ఆవేదనను అర్థం చేసుకునే అవకాశాన్ని మీకు ఇస్తుంది. స్వేచ్ఛగా కమ్యూనికేషన్ చేసే పరిస్థితులను మీ స్నేహితులకు, తల్లిదండ్రులకు, జీవిత భాగస్వాములకు కల్పించండి. దీనివల్ల మీ మధ్య అనుబంధం సురక్షితంగా ఉంటుంది.