1,357 ఎకరాలు సేకరించిన ప్రభుత్వం

వరంగల్ జిల్లా సంగెం, శాయంపేట మండలాల మధ్యలో ఉన్న చింతలపల్లివద్ద గత రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.ఈ మేరకు ఆ చుట్టుపక్కల శివారు భూములలో 2016లోనే విడతల వారీగా మొత్తంగా 1,357 ఎకరాలు సేకరించింది. దీంతో దాదాపు 863 మంది భూములను కోల్పోగా.. భూ సేకరణసమయంలో పరిహారం విషయంలో అక్కడి రైతులు గొడవ చేశారు. అప్పటి మార్కెట్ రేటు ప్రకారం ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం ఎకరానికి రూ.10 లక్షల చొప్పున మాత్రమే పరిహారం చెల్లించి, రైతులు సాగు చేసుకుంటున్న భూములను మెగా టెక్స్ టైల్ పార్కు కోసం సేకరించింది. కాగా సాగు చేసుకుంటున్న భూములతోపాటు ఉపాధి కోల్పోతుండటంతో అప్పటి ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులకు ఇంటికో ఉద్యోగంతో పాటు టెక్స్ టైల్ పార్క్ఏరియాలోనే ఒక్కో ఎకరానికి 100 గజాల చొప్పున ప్లాట్ ఇస్తామని చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here