గ్రూప్ 3 హాల్ టికెట్లను ఇలా డౌన్లోడ్ చేసుకోండి…

  1. గ్రూప్ 3 అభ్యర్థులు TGPSC వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ పై క్లిక్ చేయాలి.
  2. హోమ్ పేజీలో కనిపించే Download Hall Ticket For Group-III Services ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  3. ఆ తర్వాత ఓపెన్ అయ్యే విండోలో TGPSC ID , పుట్టిన తేదీ వివరాలు ఎంట్రీ చేయాలి.
  4. డౌన్లోడ్ పీడీఎఫ్ పై క్లిక్ చేస్తే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.
  6. ఈ లింక్ పై క్లిక్ చేసి నేరుగా గ్రూప్ 3 హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ గ్రూప్ 3 పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరు రాసేందుకు రెండున్నర గంటల సమయం ఉంటుంది. ప్రతి పేపర్‌లోనూ 150 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేయనున్నారు. గ్రూప్ 3 పోస్టులకు ఎలాంటి ఇంటర్వూ ఉండదు. ఈ గ్రూప్ 3 నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 1,388 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here