ఆ బాలికల గ్రూప్‌లకు మహిళా పోలీసులు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ గ్రూప్ బాలిక విద్య, ఆరోగ్యం, పోషకాహారం, రుతుక్రమ పరిశుభ్రత, బాల్య వివాహాలు, పోక్సో చట్టం, ఆత్మరక్షణ, వృత్తి విద్య, జీవనోపాధి అవకాశాలు మొదలైన పిల్లల సమస్యలపై చర్చిస్తుంది. అందుకోసం ఈ గ్రూప్ ప్రతి 15 రోజులకు ఒకసారి (రెండో, నాలుగో శనివారాల్లో) అంగన్వాడీ కేంద్రాల్లో సమావేశం అవ్వాలని సూచించారు. దీనికి సంబంధించి అన్ని గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం జిల్లా ఇన్ ఛార్జ్ అధికారులకు, డీఎల్డీవోఎస్లకు అన్ని జిల్లా కలెక్టర్లు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు. మండల, గ్రామ స్థాయి శిక్షణలను పూర్తి చేయడానికి, అలాగే గ్రామ, వార్డు, అంగన్వాడీ కేంద్రాలలో అందుబాటులో ఉన్న స్కూల్, కాలేజీలకు దూరంగా ఉన్న బాలికలతో గ్రూప్‌లను ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
Home Andhra Pradesh ఏపీలో కిశోరి బాలిక వికాసం ప్రోగ్రాం పునఃప్రారంభం, కలెక్లర్లకు సచివాలయ శాఖ ఆదేశాలు-ap kishori vikasam...