ఆధార్ కార్డుల్లో అడ్రస్, ఫోన్ నెంబర్, పేరులో తప్పులు సరిచేసుకునేందుకు యూఐడీఏఐ అవకాశం కల్పి్స్తుంది. పుట్టిన తేదీ మార్పులకు ప్రభుత్వ అధికారుల ధ్రువీకరణ అవసరం. తాజాగా ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పుల కోసం ప్రభుత్వ వైద్యులు జారీ చేసే ధ్రువీకరణ పత్రాలను అనుమతించాలని ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు జారీ చేసే సర్టిఫికెట్లు తరహాలో ప్రభుత్వ ఆసుపత్రులు ఇచ్చే క్యూఆర్ కోడ్ పత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అన్ని జిల్లాల సిబ్బందికి ఆదేశించింది.
Home Andhra Pradesh ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చుకోవాలా? ఇకపై ఈ సర్టిఫికెట్ ఉన్నా ఓకే -ఏపీ సర్కార్...