సంగారెడ్డిలో పర్యటించిన బండి సంజయ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఢిల్లీలో సెటిల్మెంట్.. కేటీఆర్ అరెస్ట్… కథ కంచికే. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ ఫార్ములా, ధరణి స్కాం కేసులన్నీ గాలికే. కలెక్టర్‌పై దాడి సూత్రధారి కేటీఆర్ అని తేలినా అరెస్ట్ చేయకపోవడం సిగ్గు చేటు. కేటీఆర్‌ను అరెస్ట్ చేయకపోవడం సర్కార్ చేతగానితనమే. రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్ పాలన నడుస్తోంది. రైతుల సమస్యను పక్కదారి పట్టించేందుకే దాడులు తెరపైకి తెచ్చారు’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.