ర్యాగింగ్ పేరిట భవిష్యత్ పాడు చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఉన్నతాధికారులతో మంత్రి ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు‌. ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనపై మంత్రి సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై ఎంక్వైరీ చేసి, తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, అన్ని కాలేజీల్లో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్ సహకారం తీసుకోవాలన్నారు. ర్యాగింగ్ వల్ల విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం పడకుండా చూడాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. తమ జూనియర్లతో సీనియర్ స్టూడెంట్స్‌ ఫ్రెండ్లీగా ఉండాలి తప్పితే, ర్యాగింగ్ పేరిట వారిని భయాందోళనకు గురి చేయొద్దని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here