రేషన్ కార్డుదారులు తమ వివరాలు మార్చుకునేందుకు మీ-సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. మీ దగ్గర్లోని మీ-సేవా కేంద్రానికి వెళ్లి.. ఎవరి వివరాలు జోడించాలో, మార్పు చేయాలో వారికి సంబంధించిన గుర్తింపుకార్డులు, అవసరమైన పత్రాలు, ఫొటో తీసుకుని మీ సేవా కేంద్రానికి వెళ్లాలి. రేషన్ కార్డులో భార్య పేరును యాడ్ చేయాలనుకుంటే.. ఆమె ఫొటో, గుర్తింపు కార్డుతో పాటు మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకుని మీ-సేవా కేంద్రాన్ని సంప్రదించాలి. పిల్లల పేర్లు చేర్చాలనుకున్నా, ఆ పిల్లల గుర్తింపు కార్డులు, ఫొటోలతో పాటు బర్త్ సర్టిఫికెట్లు కావాలి. రేషన్ కార్డుల్లో మార్పుచేర్పులకు సంబంధించి…అవసరమైన పత్రాలు ఆపరేటర్లు స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు.