ఇలా ఎడిట్ చేసుకోండి…
- తెలంగాణ టెట్ (2)కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఇక్కడ తెలంగాణ టెట్ – 2 లింక్ పై క్లిక్ పై చేయాలి.
- కొత్తగా ఓపెన్ అయ్యే విండో హోం పేజీలో Edit Application అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి.
- ఇక్కడ Journal Number, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
- మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీ వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు.
- చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ఎడిట్ పూర్తి అవుతుంది.
- ప్రింట్ అప్లికేషన్ పై క్లిక్ చేసి మీ దరఖాస్తు ఫారమ్ ను పొందవచ్చు.
తెలంగాణ టెట్ దరఖాస్తు విధానం:
- టెట్ రాసే అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా https://tgtet2024.aptonline.in/tgtet/# వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ముందుగా ‘Fee Payment’ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
- పేమెంట్ స్టెటస్ అనే కాలమ్ పై నొక్కి దరఖాస్తు రుసుం చెల్లింపు ప్రక్రియ పూర్తి అయిందా..? లేదా అనేది చెక్ చేసుకోవాలి.
- ఆ తర్వాత ‘Application Submission’ అనే లింక్ పై క్లిక్ చేయాలి.
- మీ వివరాలను నమోదు చేయాలి. ఫొటో, సంతకం తప్పనిసరిగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- అన్ని వివరాలను ఎంట్రీ చేశాక చివర్లో ఉండే సబ్మిట్ బటన్ పై నొక్కితే అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
- ‘Print Application’ అనే ఆప్షన్ పై నొక్కితే మీ దరఖాస్తు కాపీనీ డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు.
- రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ నెంబర్ ఉపయోగపడుతుంది.
తెలంగాణ టెట్ హాల్ టికెట్లు 26 డిసెంబర్ 2024న విడుదలవుతాయి. జనవరి 1, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. జనవరి 20, 2025తో ముగుస్తాయి. ఫిబ్రవరి 5వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు. ఈ టెట్ పూర్తి అయ్యే సమయానికి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.