ధాన్యం కొనుగోళ్లకు ఏపీ ప్రభుత్వం టెక్నాలజీ వినియోగిస్తుంది. వాట్సాప్ సేవలను ధాన్యం కొనుగోళ్లలో ఉపయోగిస్తుంది. ఆరుగాలం రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకొనేందుకు ఎలాంటి శ్రమ అవసరం లేకుండా….సులభమైన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది. 73373 59375 నెంబర్ కు వాట్సాప్ లో Hi పెడితే చాలు…ధాన్యం కొనుగోలు సేవలు అందుబాటులోకి వస్తాయి. రైతులు ఏ కేంద్రంలో, ఏ రోజు, ఏ టైంలో, ఏ రకం ధాన్యం, ఎన్ని బస్తాలు అమ్మదలుచుకున్నారో వాట్సాప్ లో పౌరసరఫరాల శాఖ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయాలకు స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలిపే వీడియోను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్స్ మాధ్యమంలో పోస్టు చేశారు.
Home Andhra Pradesh వాట్సాప్ ద్వారా ధాన్యం కొనుగోలు, రైతు హాయ్ చెబితే చాలు- వినూత్న పద్ధతికి ఏపీ సర్కార్...